కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 47 మంది నివాసితులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
నేడు సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల విచారణ జరగనుంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో అనేక కేసులు విచారణకు రానున్నాయి, ఇందులో తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే కేసుపై నేడు అందరి దృష్టి ఉంటుంది. ఇది కాకుండా కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.…
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. కోట్లాదిమంది ప్రపంచ వ్యాప్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టిందని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది.
Child Pornography Case: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారి హిందువులు, భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.
భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కి గురైంది. సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం కేసులు, ప్రజా ప్రయోజనాల కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఈ ఛానెల్ ఉపయోగించబడుతుంది.
Supreme Court: కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచరన్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా స్థానిక ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని ‘‘పాకిస్తాన్’’గా పేర్కొన్నారు. ఇదే కాకుండా ఓ మహిళ న్యాయవాదితో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.