Supreme Court : భూ పరిహారం విషయంలో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం చెల్లించడంలో సుదీర్ఘ జాప్యం జరిగితే,
Places of Worship Act: భారతదేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (జనవరి2) విచారణ జరపనుంది.
KTR : ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని, అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని, నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని ఆయన విమర్శించారు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని…
దల్లేవాల్‌కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి.. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇవ్వడానికి అవకాశం రావడం లేదని సుప్రీంకోర్టు ముందు పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రభుత్వం విన్నపం మేరకు కోర్టు మరో మూడు రోజుల గడువు ఇచ్చిందని పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వెల్లడించారు.
Donald Trump On Tiktalk: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌పై నిషేధాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టును కోరారు. టిక్‌టాక్‌ను నిషేధించే చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, సమస్యకు రాజీ పరిష్కారం సాధించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. జనవరి 19, 2025 వరకు నిషేధ గడువును పొడిగించాలని ట్రంప్ కోరుతున్నారని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను,…
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుత చర్యల కారణంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇండియాలో పుట్టి అమెరికాలో ఐటీ కన్సల్టెన్సీ సర్వీసును విజయవంతంగా నడుపుతున్న ఓ వ్యక్తి పెళ్లి విడాకుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2020 నవంబర్‌లో అతని మొదటి భార్యకు రూ.500 కోట్లు భరణంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం అతని రెండవ భార్యకు రూ.12 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. 12 కోట్ల భరణాన్ని సముచితంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రెండో భార్య అవసరాలు, పరిస్థితుల ఆధారంగా ఆమెకు భరణం ఇస్తున్నట్లు పేర్కొంది. భరణం యొక్క ఉద్దేశ్యం…
Credit Cards : క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 30 శాతంగా నిర్ణయించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు..