Supreme Court: సంజయ్ రాయ్‌కు జీవితఖైదు.. నేడు విచారించనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్
- నేడు సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ హత్య కేసు విచారణ..
- సంజయ్ రాయ్‌కు జీవితఖైదుపై విచారించనున్న చీఫ్ జస్టిస్ బెంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. అయితే, మరోవైపు కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ జీవిత ఖైదు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టుకు వెళ్లింది. నిందితుడికి మరణశిక్ష విధించాలన్న అప్పీలుపై విచారణకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ తీసుకుని విచారణ చేసింది. దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు తగిన సాక్ష్యాలను సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన విజువల్స్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Ration Cards: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
ఇక, జీవిత ఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదని పేర్కొన్నారు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తామని వారు చెప్పారు. ఈ నేరంలో ఇతర భాగస్వాములను వదిలి పెట్టారు.. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? డాక్టర్ విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది అంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివెనక పెద్ద కుట్ర ఉందన్నారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!