Supreme Court: సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వారు ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి…
Telangana MLAs: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ…
KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు.
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి.…
Supreme Court : దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వీఐపీల ప్రవేశం అనే ట్రెండ్ నడుస్తోంది. వీటిని ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు ఈ పిటిషన్కు సంబంధించి ఎటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి.. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అని సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ప్రశ్నించారు. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా? అని సెటైర్లు వేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అడిగిన సుప్రీం కోర్టు.
గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది.
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది.