చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య.. అయితే, బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్.. దీంతో.. మణీందర్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేది.
Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘‘సనాతన’’ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఉదయనిధికి సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌ని ఎలా కొనసాగించవచ్చని జస్టిస్ బేలా ఎం త్రివేది,…
Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్‌కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకి పూర్తిగా సహకరించాలని.. సాక్షులని ప్రభావితం చేయవద్దని తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంకు గట్టి షాక్ తగిలింది. గడిచిన 10 నెలలుగా తిరుపతన్న జైలులో ఉన్న…
సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.…
Supreme Court: కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో…
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై…