SC-ST reservation: చరిత్రలో మొదటిసారిగా, భారత సుప్రీంకోర్టు, తన సిబ్బంది నియామకాలు, ప్రమోషన్ల విషయంలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని అధికారికంగా అమలు చేసింది. జూన్ 24, 2025 నాటి ఇంటర్నల్ సర్క్యులర్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తు్న్నట్లు ప్రకటించింది. ఇది దేశ అత్యున్నత న్యాయ సంస్థలో నియామకాలు, ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు.
Read Also: Tamilnadu: ‘‘ అధికార మత్తు.. రాష్ట్రమే సొంత పౌరుడిని చంపింది’’.. లాకప్ డెత్‌పై హైకోర్టు ఆగ్రహం..
సర్క్యులర్ ప్రకారం, మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్‌లు కోర్టు ఇంటర్నల్ నెట్వర్క్(సుప్‌నెట్)లో అప్‌లోడ్ చేశారు. జూన్ 23, 2025 నుంచి ఇది అమలులోకి వచ్చింది. రిజర్వేషన్ విధానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కేటాయిస్తారు. ఈ విధానం రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లుకు వర్తిస్తుంది.
జాబితాలో ఏమైనా లోపాలు ఉంటే, సిబ్బంది తమ అభ్యంతరాలను నేరుగా రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్)కి సమర్పించాలని కోరారు. దీని ద్వారా పారదర్శకత పెరుగనుంది. ఈ విధానం భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి పదవీ కాలంలో వచ్చింది. షెడ్యూల్డ్ కులాల నుంచి సుప్రీంకోర్టు సీజేఐ అయిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.