సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లోనూ జడ్జీల నియామకం చేపట్టగా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు.. గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్శు ధులియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్.. దీంతో, సుప్రీంకోర్టులో ఉత్తరాఖండ్ నుంచి రెండవ న్యాయమూర్తి కానున్నారు ధులియా.
Read Also: Honour killing: మా అన్న దుర్మార్గుడు.. వాడిని చంపేయాలి
ఇక, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జంషేడ్ బి పార్దీవాలా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.. సుప్రీంకోర్టులో పార్సీ అల్ప సంఖ్యాక వర్గం నుంచి నాల్గో న్యాయమూర్తి. అయితే, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సుభాష్ రెడ్డిల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీల భర్తీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది.. ఒకే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ఏకాభిప్రాయం సాధించి సిఫారసు చేయడం ఒక రికార్డుగా చెబుతున్నారు… ముగ్గురు మహిళలతో సహా ఒకే సారి 9 మంది న్యాయమూర్తులు గత సంవత్సరం ఆగస్టు 31 న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.