Bilkis Bano Case: ”బిల్కిస్ బానో” కేసులో దోషుల విడుదలపై సుప్రీంలో సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case: 2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు దుండగులు. ఆ టైంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు . 15ఏళ్లు కారాగారంలోనే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీరి విడుదలకు గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో.. గోద్రా సబ్ జైలు నుంచి విడుదల చేశారు అధికారులు. అంతేకాదు వీరికి పెద్ద ఎత్తున ఓ సంస్థ స్వాగతాలు పలకడం, మిఠాయిలు పంచుకోవడం కూడా వివాదమైంది. దోషుల విడుదలపై జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. బిల్కిస్ సహా ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, దోషుల విడుదల ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. మహిళా హక్కుల కార్యకర్తలు ఈ పిటిషన్ వేశారు.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, జర్నలిస్టు రేవతి లాల్, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసని.. దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది.
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ
గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత ఆగస్టు 19న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేసింది.
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!