వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..
RGV : సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్, సదా లాంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వారికి నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా.. అవి సరిపోవు అని నేరుగా ఆర్జీవీ రంగంలోకి దిగిపోయాడు. డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నాడు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్…
చట్టసభల్లో ఆమోదింపబడిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని సుప్రీంకోర్టు గతంలో ధర్మాసనం ఆదేశించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Supreme Court Cancels Telangana MLC Appointments: తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో కోదండరామ్, ఆమిర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకంను రద్దు చేసింది. కోదండరామ్, అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇద్దరి నియామకాలను సవాల్ చేస్తూ.. దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్,…
Supreme Court: ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ, ప్రైవట్ పరంగా వివిధ సేలలు పొందేందుకు ఆధార్ కార్డును ఓ గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించ్చు కానీ.. భారత దేశ పౌరసత్వానికి ఇది ఖచ్చితమైన రుజువు కాదని తేల్చి చెప్పింది.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు…
K.A. Paul: యెమెన్లో మరణశిక్ష నుంచి తప్పించుకున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియ జూలై 16న చనిపోవాల్సింది. జూలై 14 న సుప్రీం కోర్టులో నిమిషను కాపాడలేక పోయాం అని కేంద్రం చెప్పింది. కానీ మొత్తానికి ఆమెను మరణ శిక్ష నుంచి తప్పించాం. కానీ నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొన్ని శక్తులు ఆమె విడుదలను ఆపించారని…