Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో ఆధార్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించడంలో అనేక పరిమితులు ఉండటం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉండేవి.
ఇకపై, ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ల గుర్తింపును సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను, న్యాయసమానత్వాన్ని పెంపొందించడంలో ముఖ్యంగా దోహదపడనుంచి. అలాగే వినియోగదారులకి సౌకర్యాన్ని అందిస్తూ, అవినీతిని తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుంది.
Nivetha Thomas : నివేతా థామస్ ఓనం ఫొటోస్ చూస్తే చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే
ఈ కొత్త మార్పు ప్రస్తుత ఎన్నికల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే సూచనగా భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా, నియమావళి ప్రకారం దీనిని అమలు చేయడం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో అన్ని నియమాలు, ప్రక్రియలు ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోనుంది.