CJi Gavai vs BJP: న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
- సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటనను ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. కానీ కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు మాత్రం.. దాడికి యత్నించిన న్యాయవాది ధైర్యాన్ని ప్రశంసించారు. న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.
భాస్కర్ రావు బెంగళూరు కమిషనర్‌గా పని చేశారు. ‘‘చట్టపరంగా తప్పు అయినప్పటికీ వయస్సుతో సంబంధం లేకుండా ఒక వైఖరి తీసుకుని దానికి అనుగుణంగా జీవించే మీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను.’’ అని ఎక్స్‌లో భాస్కర్ రావు రాశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా నిలిచిపోయిన వందలాది వాహనాలు
అయితే బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మన్సూర్ ఖాన్ తప్పుపట్టారు. ‘‘చట్టప్రకారం తప్పు అయినప్పటికీ అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారా?, మాజీ ఐపీఎస్ అయి ఉండి సిగ్గుచేటుగా లేదా?, ఒకప్పుడు మీరు చట్టాన్ని సమర్థించారు. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిని అవమానించిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు. ఇంది ఎంత పతనం.’’ అని భాస్కర్ రావుకు మన్సూర్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.
గవాయ్‌పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు. ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!