దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కాలుష్యం కారణంగా నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకి గాలి నాణ్యత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
Supreme Court: భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది.
Supreme Court: గురుద్వారాలో ప్రవేశించడానికి, పూజ చేయడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారిని తొలగించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ‘‘అతను ఆర్మీకి పనికి రాడు’’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని అసమర్థుడిగా ముద్ర వేసింది. తన తొటి సిక్కు సైనికులు విశ్వాసాన్ని గౌరవించనందుకు అతడిని తొలగించిన ఆర్మీ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేచించారు.
భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిన్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్ది చివరి పని దినం.
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది.
Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.