Mamata Banerjee: ‘న్యాయం ఏడుస్తోంది’.. ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు.. 26 కవితలతో మమత నిరసన
- హస్తిన వేదికగా ‘‘సర్’’పై మమత పోరాటం
- ‘న్యాయం ఏడుస్తోంది’
- ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు
- 26 కవితలతో మమత నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తిన వేదికగా ‘‘సర్’’పై పోరాటానికి దిగారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి తన నిరసన తెలియజేశారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వేదికగా తన నిరసనను వ్యక్తపరిచారు.
ఇది కూడా చదవండి: Melinda Gates: ఎప్‌స్టీన్ ఫైల్ వల్లే బిల్‌గేట్స్‌తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
ఇటీవల బెంగాల్‌లో ఎన్నికల సంఘం ‘‘SIR’’ నిర్వహించి 58 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక మమతనే స్వయంగా రంగంలోకి దిగి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈసీ తీరును ఎండగట్టారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల సంఘానికి తాను చాలాసార్లు లేఖ రాశానని.. ‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు. తాను తన పార్టీ తరపున వాదనలు చేయడం లేదని… పెద్ద కారణం కోసం వాదనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈసీ జారీ చేసిన వివిధ ఆదేశాలు, సూచనలు రద్దు చేయాలని కోరారు.
‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తున్నప్పుడు… మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మేము అనుకున్నాము. మేము ఎన్నికల సంఘానికి 6 లేఖలు రాశాము. నేను ఒక బంధిత కార్మికుడిని… నాకు అది ఇష్టం. నేను నా పార్టీ కోసం పోరాడటం లేదు.’’ అని ఆమె చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.
కవితలు..
ఇదిలా ఉంటే ‘సర్’ ఉద్యమాన్ని మమత కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దీనిపై 26 కవితలతో కూడిన పుస్తకాన్ని రాశారు. పౌరులు ఎదుర్కొంటున్న వేధింపులు, భయాన్ని కవితల రూపంలో తెలియజేశారు. ఈసీకి వ్యతిరేకంగా రాసిన కవితల పుస్తకాన్ని ఇటీవలే విడుదల చేశారు. 26 in 26 అనే శీర్షికతో రాసిన కవితా పుస్తకాన్ని జనవరి 22న 49వ అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో విడుదల చేశారు. పానిక్, డూమ్, ఎగతాళి, ప్రజాస్వామ్యం ఉత్తేజకరమైన శీర్షికలు ఉన్నాయి. పుస్తకం పరిచయంలో శ్లోకాలను పొందిపరిచారు. ఇక సర్ కారణంగా నిరంతరం భయం కొనసాగుతోందని ఆరోపించారు. కొన్ని కార్యక్రమాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజుల్లోనే ఈ కవితలు రాశానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: West Bengal CM Mamata Banerjee leaves after hearing in SIR matter in Supreme Court. pic.twitter.com/KmuJt9Oowa
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు