దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది. Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..? అధిక వేడి కారణంగా, ఒక కోతి…
భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే ఆలా అని ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు.…
మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అదే విధంగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో బార్లీ…
ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఉరుకుల పరుగుల జీవితం. అందునా నగర జీవనంలో పక్కవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక వుండదు. అసలే ఎండాకాలం. సూరీడు చుర్రుమంటున్నాడు. మామలుగా నడిచే వెళ్ళే వ్యక్తులు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది అతడి మానాన అతడిని వదిలేశారు. అతను అలాగే వుండిపోయాడు. కానీ కొందరు అలా కాదు. పక్కన…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…