ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఉరుకుల పరుగుల జీవితం. అందునా నగర జీవనంలో పక్కవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక వుండదు. అసలే ఎండాకాలం. సూరీడు చుర్రుమంటున్నాడు. మామలుగా నడిచే వెళ్ళే వ్యక్తులు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది అతడి మానాన అతడిని వదిలేశారు. అతను అలాగే వుండిపోయాడు.
కానీ కొందరు అలా కాదు. పక్కన ఏం జరిగినా.. చివరికి చీమ చిటుక్కుమన్నా స్పందించడం అలవాటు. ఇక్కడ కూడా అదే జరిగింది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కొందరు ఆగిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పడిపోయిన వ్యక్తిని పైకి లేపారు. అతడికి సపర్యలు చేసి అతనికి మెలకువ వచ్చే వరకు అక్కడే వున్నారు. మంచినీళ్ళు తాగించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా అతనికి కావలసిన డబ్బులు కూడా ఇచ్చారు .
హైదరాబాద్ లో జరిగిన సంఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. వాహనదారులు చూపించిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎండాకాలంలో ఇలాంటివి జరిగితే వెంటనే స్పందించండి. అలాంటివారిలో మన ఆత్మీయులు కూడా వుండవచ్చు. రోడ్డుమీద వెళుతున్నవారు కాపాడకపోతే కొంతమంది ప్రాణాలు పోవచ్చు. గోల్డెన్ అవర్ అని ఒకటుంటుంది. ఆ గోల్డెన్ అవర్ లో సాయం చేస్తే వడదెబ్బ తగిలినవారు కోలుకుంటారు. గుండెనొప్పి వచ్చిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడతారు.
Read Also: LIVE: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..