ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే ఆలా అని ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం…
జాగ్రత్తలు:
1. ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
2. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి.
3. ఎక్కువగా నిమ్మరసం, బార్లీ వాటర్ తాగుతూ ఉండాలి.
4. అవసరాన్ని బట్టి ORS ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి,మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి. వాటికి బదులుగా కొబ్బరి నీరు తరచూ తాగుతుండాలి.
5. తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. తరచుగా కళ్ళను చన్నీళ్ళతో కడుగుతూ వుండాలి.
6. తలకు ఎండ తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. గొడుగు వాడే అవకాశం వుంటే అది వాడడం అలవాటు చేసుకోవాలి. బాడీ డీ హైడ్రేట్ కాకుండా చూసుకుంటే వడదెబ్బకు మీరు దూరంగా వుండవచ్చు.