Temperature Rise: భారతీయ నగరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీ నగరంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
Nitin Gadkari: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నట్లుండి ఎన్నికల వేదికపైనే కుప్పకూలారు. వేసవి వేడి ధాటికి గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు.
వేసవి కాలం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, మనం పండ్లు, లస్సీ, పండ్ల రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటి అనేక చల్లని పదార్థాలను తీసుకోవడం ప్రారంభిస్తాం. ఇవన్నీ మన శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు, కానీ మన శరీరానికి వేడిని అందించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.
Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.