ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి.
Telangana Temperatures: తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణ రాధాజని హైదరాబాద్ లో వేసవి తాపం మొదలైంది. నిన్న మొన్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం ఉండటం లేదు. అంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో ఉండీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కాగా..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండే ఎండలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భానుడి…
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల…
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…