‘కలర్ ఫోటో’తో హీరోగానూ పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. ఈ సినిమాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ అనే టైటిల్ నిర్ణయించారు. స్వేచ్ఛ క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. తొలి షాట్ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ‘C/O కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా,…
సుహాస్ అంటే అందరికీ తెలిసింది కమెడియన్ గానే! అయితే ఆ మధ్య ‘కలర్ ఫోటో’లో హీరోగా నటించిన సుహాస్ మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. తాజాగా అతను నటిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ జనాల్లో ఆసక్తిని కలగచేయగా, లేటెస్ట్ ట్రైలర్ వాళ్ళను ఓ రకంగా షాక్ కు గురిచేసింది. ఈ మూవీలో సుహాస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తుండమే దానికి కారణం. మెహర్ తేజ్…
‘మజిలి’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని ‘కలర్‌ఫోటో’లో హీరోగా నటించాడు కమెడియన్ సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి…