2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దేశాల మధ్య యుద్ధాలు.. ఇంకోవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించడం. ఇలా ఏడాది పొడవునా గందరగోళమే నెలకొంది. ఈ సంవత్సరం హైలెట్‌గా నిలిచిన వార్తలపై ఒకసారి లుక్కేద్దాం. ట్రంప్ వాణిజ్యం యుద్ధం ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ…
కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది.
డొమినికన్ బీచ్‌లో తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులు అవుతున్నా జాడ మాత్రం దొరకలేదు. ఐదుగురు స్నేహితులతో కలిసి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది. పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది. దీంతో స్నేహితుల సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు.
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తు్న్నారు.