డొమినికన్ బీచ్‌లో తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులు అవుతున్నా జాడ మాత్రం దొరకలేదు. ఐదుగురు స్నేహితులతో కలిసి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది. పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది. దీంతో స్నేహితుల సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు.
మార్చి 4న సుదీక్ష అదృశ్యమైంది. దాదాపు వారం రోజులైనా ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే తమ కుమార్తె కిడ్నాప్‌నకు గురై ఉంటుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
సుదీక్ష కోనంకి.. వర్జీనియాలోని సౌత్ రైడింగ్ వాసి. పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడిసిన్ చదువుతోంది. సెలవులు రావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ విహారయాత్రకు వెళ్లింది. పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్‌లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఉన్నట్టుండి మాయమైంది. స్నేహితుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. నిఘా ఫుటేజ్ పరిశీలించారు. తెల్లవారుజామున 3 గంటలకు రిసార్ట్ డిస్కోలో పార్టీ చేసుకున్నారు. అనంతరం తెల్లవారుజామున 4 గంటలకు సుదీక్ష బీచ్‌కు వెళ్లింది. ఉదయం 5:50 గంటలకు సుదీక్షను స్నేహితులు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడు బీచ్‌లో సుదీక్ష తాగిన మైకంలో ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి చూశాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పిపడిపోయి ఉన్నట్లు చూశాడు. అంతే కాకుండా ఆమె వాంతు కూడా చేసుకున్నట్లు చూసిన వ్యక్తి తెలిపాడు.
సుదీక్ష.. బీచ్‌లో ఉన్నప్పుడు ఆమె ఒంటిపై బట్టలు కూడా లేనట్టుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన దుస్తులు బీచ్ ఒడ్డున కనిపించాయి. కేవలం బికినీ మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమెను చివరి సారిగా చూసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. అతడే తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ అతడిపై కిడ్నాప్ అనుమానాలు మాత్రం పోలీసులు వ్యక్తం చేయలేదు. అయితే బీచ్ ఒడ్డున ఉండడంతో భారీ కెరటం ఏదైనా వచ్చి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానిస్తు్న్నారు. ఒకవేళ బీచ్‌లోకి కొట్టుకుపోయి ఉంటే.. ఈపాటికి మృతదేహం ఒడ్డుకి కొట్టుకురావాలి. కానీ వారం రోజులు అవుతున్నా.. శవం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కచ్చితంగా ఎవరో తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డొమినికన్ రిపబ్లిక్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జువాన్ సలాస్ మాట్లాడుతూ.. ఆమె సజీవంగా కనిపించే అవకాశాలు చాలా తక్కువ అని అన్నారు. ఆమె కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవలతో గాలింపు చేపట్టినట్లు పేర్కొ్న్నారు.
సుదీక్ష ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నల్లటి జుట్టు. గోధుమ రంగు కళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అదృశ్యమైన సమయంలో గోధుమ రంగు బికినీ.. పెద్ద గుండ్రని చెవిపోగులు. కుడి కాలు మీద మెటల్ డిజైనర్ చీలమండ. కుడి చేతిలో పసుపు మరియు స్టీల్ బ్రాస్‌లెట్‌లు. ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.