US: బీచ్‌లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం.. బికినీలో ఉండగా మాయం
- యూఎస్ బీచ్‌లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం
- బికినీతో బీచ్‌లో నడుస్తుండగా మాయం
- పోలీసుల గాలింపు.. కుట్రపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం… పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష(20) చదువుకుంటుంది. తన స్నేహితులతో కలిసి గురువారం విహార యాత్రకు వెళ్లింది. డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో బికినీ ధరించి నడుస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైంది. దీంతో గురువారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు.. ఆమె కోసం గాలింపు ప్రారంభించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్

ఆమె ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నల్లటి జుట్టు. గోధుమ రంగు కళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అదృశ్యమైన సమయంలో గోధుమ రంగు బికినీ.. పెద్ద గుండ్రని చెవిపోగులు. కుడి కాలు మీద మెటల్ డిజైనర్ చీలమండ. కుడి చేతిలో పసుపు మరియు స్టీల్ బ్రాస్‌లెట్‌లు. ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
సుదీక్ష కోసం పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ అధికారులు, కుటుంబ సభ్యులు వర్జీనియాలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. విద్యార్థినిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధి జారెడ్ స్టోన్‌సిఫర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె కోసం అన్వేషణ జరుగుతుందని వెల్లడించారు.
సుదీక్ష.. అమెరికాలో విద్యను అభ్యసిస్తోంది. 2026లో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలు కాబోతుంది. ఇక అంతకముందు వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని థామస్ జెఫెర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. డిగ్రీ చదువుపై మాత్రం క్లారిటీ లేదు.
మరోవైపు సుదీక్ష అదృశ్యం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బీచ్‌లో బహు మంది పర్యాటకులు ఉన్నప్పుడే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె అదృశ్యం వెనుక ఏదో కుట్ర దాగి ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!