రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్..
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేశారు.
రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు.
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది.
విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
గురువులు.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేవారు. బంగారు భవితకు బాటలు వేసేవారు. పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత.. ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయుల మధ్యనే. అందుకే విద్యార్థులకు-టీచర్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా గురువులే మార్గదర్శకులు. అయితే ఇదంతా ఎందుకంటారా? సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన తాజాగా వైరల్‌గా మారింది.
వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్లో కలకలం రేగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆగస్ట్ 28న బిజెపి పిలుపునిచ్చిన 12 గంటల సమ్మెలో పాల్గొనవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలను కోరింది. సమ్మె కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతినకుండా పరిపాలన చూస్తుందని వెల్లడించింది.