దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్ ప్రారంభించేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు. నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి.…
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ.…
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ రైతు ధర్నాకు వెళ్తున్న క్రమంలో కేటీఆర్‌ను ఆపిన యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వినతి పత్రంలో అందించారు.
సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమశాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హెచ్చరికలకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన రెండు బాంబు బెదిరింపులను స్టూడెంట్స్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్‌కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
విశాఖపట్నంలో నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయినా లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.. కార్లు, ఇళ్లు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది.. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..
మహారాష్ట్రలోని లాతూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ అవుతోంది. ఓ విద్యార్థినికి చెందిన కుటుంబీకులు ఉపాధ్యాయుడిని కొట్టడం వీడియోలో చూడొచ్చు. తొమ్మిదో తరగతి విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకు ఉపాధ్యాయుడిని కొట్టినట్లు సమాచారం.