ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటూనే విద్యార్థులు చదువుకోవాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. పరీక్షా పే చర్చ సందర్భంగా మోడీ ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని సుందరవనంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించారు. వర్చువల్‌గా అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో అతడిని పక్కన పెట్టొద్దు: రైనా
సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు. పరీక్షలే సర్వస్వం కాదని విద్యార్థులకు సూచించారు. మనం రోబోలం కాదని, మనషులమని, ఒక దగ్గరే గిరిగీసుకొని ఉండొద్దని సలహా ఇచ్చారు. బయటినుంచి వచ్చే ఒత్తిడి మీద కాకుండా చదువుమీద దృష్టిపెట్టాలని సూచించారు. స్టేడియంలో వీక్షకులు కేకలేస్తూ, కేరింతలు కొడుతూ ఎంతగా శబ్దాలు చేస్తున్నా.. బ్యాటర్ దృష్టి మాత్రం బంతిపైనే ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టాలని మోడీ సూచించారు. ప్రాముఖ్యంగా కంటినిండా నిద్ర, సమతుల ఆహారం ముఖ్యమని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు మోడీ హితవు పలికారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ప్రధాని ఉదహరించారు. సచిన్‌కు చదువు కంటే ఆటల మీదే ఆసక్తి ఎక్కువ ఉండేదని.. దాన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారని ప్రధాని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Bihar : బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు
ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది.. మిగతావారంతా వర్చువల్‌గా పాల్గొన్నారు.