CBSE Single Girl Child Scholarship: విద్యార్థులకు రూ. 24 వేల స్కాలర్‌షిప్ ఇస్తున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి
- విద్యార్థులకు రూ. 24 వేల స్కాలర్‌షిప్
- సీజీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ 2024
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 08
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 24 వేల స్కాలర్ షిప్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్ షిప్ అందిస్తోంది. అయితే ఈ స్కాలర్ షిప్ విద్యార్థులందరికీ కాదండోయ్. పేరెంట్స్ కు ఏకైక సంతానంగా కూతురు ఉన్న విద్యార్థినులకు ఇస్తారు. ఈ ఏడాది కూడా సీజీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ 2024 కు ప్రకటన రిలీజ్ చేసింది. ఈ స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఏకైక కూతురు అయి ఉండాలి. సీబీఎస్ఈలో టెన్త్ పాసై ఉండాలి. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు, పన్నెండు తరగతి చదువుతూ ఉండాలి. టెన్త్ లో 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
Also Read
- World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
విద్యార్థిని ట్యూషన్ ఫీజు రూ. 2500కంటే మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు నెలకు రూ. వెయ్యి చొప్పున అందిస్తారు. అంటే మొత్తంగా రూ. 24 వేలు వస్తుంది. అయితే విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యార్థిని 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సింగిల్ గర్ల్ చైల్డ్ విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!