KTR: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్.. విద్యార్థులు వినతి పత్రం
- మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్లిన కేటీఆర్
- విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
- తమ సమస్యలను వినతి పత్రంలో అందించిన విద్యార్థులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ రైతు ధర్నాకు వెళ్తున్న క్రమంలో కేటీఆర్‌ను ఆపిన యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వినతి పత్రంలో అందించారు. ధర్నా ముగించుకుని వెళ్లే సమయంలో యూనివర్సిటీకి వస్తానని హామీ ఇచ్చిన ఆయన.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో యూనివర్సిటీకి చేరుకున్నారు కేటీఆర్. యూనివర్సిటీ బయట విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సమస్యలను, మెస్ ఛార్జీల పెంపు విషయంపై కేటీఆర్‌కు విద్యార్థులు వినతిపత్రం అందించారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి తమ సమస్యలను తెలుసుకోవాలని విద్యార్థులు కేటీఆర్‌ను కోరాగా.. లోపలికి వస్తే విద్యార్థులపై కేసులు పెడతారని మరోసారి యూనివర్సిటీకి వస్తానని విద్యార్థులకు చెప్పారు కేటీఆర్.
Read Also: Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
కాగా.. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహించింది. అందులో భాగంగా.. కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. వారి పాలనలో రైతుల కష్టాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇవ్వదని ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి చర్చకు దమ్ముంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లాక్ టవర్ వద్దకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రశ్నించాలంటే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నల్లగొండ ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: CM Chandrababu: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి.. కష్టపడిన వారికే ప్రాధాన్యత!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..