ఇక వరసగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు.. తేదీలు ఇవిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు వరసగా ఎంట్రెన్స్ లు జరగబోతున్నాయి.
వివిధ రకాల ఎంట్రెన్స్ టెస్ట్‌ల తేదీలను పరిశీలిస్తే…
- జులై 17న పాలిసెట్ (పాలిటెక్నిక్, బాసర ఐఐఐటీ అడ్మిషన్స్ కోసం..)
- జులై 20, 22, 25, 27 తేదీల్లో జేఈఈ మెయిన్
- ఆగస్టు 3న ఈసెట్
- ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్…
- ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్
- ఆగస్టు 11 నుండి 13 వరకు పీజీ ఈసెట్
- ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్
- ఆగస్టు 23న లా, పీజీ లా సెట్
- ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్
- ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 2 వరకు జేఈఈ మెయిన్ నాలుగో విడత..
- సెప్టెంబర్ 11 న నీట్ పిజి ఎంట్రెన్స్
- సెప్టెంబర్ 12న నీట్ యూజీ ఎంట్రెన్స్ ఇలా వరుసగా పరీక్షలు జరబోతున్నాయి..
మరోవైపు.. రేపు తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఈ పరీక్షకు లక్షా 2,496 మంది విద్యార్థులు దారఖాస్తు చేసుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా.. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులకు పది గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతి ఇవ్వనుండగా.. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ అని స్పష్టం చేశారు.. ఇక, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ర్యాంక్ ల ద్వారా… పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
తాజావార్తలు
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!