Bihar: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై తాజాగా రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన తెలిపిన స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్‌ఇహెచ్‌యూ) ఆందోళనలతో అట్టుడికింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలు ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
Manipur voilance: మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలువురు స్కూల్, కాలేజీ విద్యార్థులు ఇవాళ (సోమవారం) రాజ్ భవన్ వైపు ర్యాలీ తీశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌ను రద్దు చేయకూడదని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పేపర్ లీక్ అనేది పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందన్నారు.
యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు.
Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.
కాలేజీ క్యాంపస్ లలో యూదుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతుండటాన్ని అమెరికా శ్వేత సౌధం తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి అమెరికన్ కు ఉంది.
దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు పులిసి వాసన వస్తున్న ఇడ్లీలు పెట్టారని విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలోని విద్యార్థులకు ఉదయం పెట్టాల్సిన ఇడ్లీ మధ్యాహ్నం పెట్టారని, ఇడ్లీలు వాసన రావడంతో విద్యార్థుల ఆందోళనకు దిగారు.