Bihar: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై తాజాగా రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన తెలిపిన స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. డిసెంబర్ 13 నుంచి స్టార్ట్ అయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట- ఒక మరో పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా.. విద్యార్థులు ఎంత చెప్పినా కూడా వినకుండా బీపీఎస్సీ ఆఫీసులోకి వెళ్లేందుకు దూసుకెళ్లారు. అలాగే, రోడ్డు మీద బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతోనే.. తాము వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది అని సిటీ పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
అయితే, ఆందోళన చేస్తున్న పరీక్షల అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేయగా.. అందులో పలువురికి గాయాలు అయ్యాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను పట్నా నగర పోలీసులు ఖండించారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు తాము స్వల్ప లాఠీఛార్జ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.
https://twitter.com/SonuYadav918/status/1864945165485355014