Manipur voilance: మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలువురు స్కూల్, కాలేజీ విద్యార్థులు ఇవాళ (సోమవారం) రాజ్ భవన్ వైపు ర్యాలీ తీశారు. పలు చోట్ల రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గతేడాది నుంచి కొనసాగుతున్న హింస పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, గవర్నర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేగాక నైతిక కారణాలతో 50 మంది ఎమ్మెల్యేలు సైతం రిజైన్ చేయాలని తెలిపారు. హింసాత్మక పరిస్థితులను నియంత్రించడంలో విఫలమైన పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు.డ్రోన్ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
Read Also: Peanuts health benefits: పల్లీలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
అయితే, స్టూడెంట్స్ రాజ్ భవన్ వైపు వెళ్తుండటంతో పోలీసులు, భద్రతా బలగాలు బారికేడ్లు వేసి వారిని అడ్డుకున్నారు. ఈ నిరసన గుంపును చెదర గొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధన్మంజూరి విశ్వ విద్యాలయం స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. జైలులో ఉండటానికి, ఇంఫాల్‌లో ఉండటానికి తేడా లేదు.. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేసేందుకే ఈ మెగా ర్యాలీ నిర్వహించామన్నారు. కాగా, గత 7 రోజులుగా రాష్ట్రంలో హింస పెరిగిపోయింది. మిలిటెంట్లు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో 8 మంది చనిపోగా.. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | Manipur: Hundreds of students march to Raj Bhavan in Imphal, demanding removal of DGP and Security Advisor over the situation in the state. pic.twitter.com/Agyim2sqDL
— ANI (@ANI) September 9, 2024