Students Protest: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఏయూ వీసీ రాజీనామా డిమాండ్ తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఎగ్జామ్స్, క్లాస్ లు బహిష్కరించారు.. క్యాంపస్ లో ర్యాలీలు నిర్వహించారు.. ఏయూ హాస్టల్‌లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక మృతిచెందిన నేపథ్యంలో.. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆ విద్యార్థి మృతిచెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.. తమ సమస్యలు పట్టించుకోని వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్‌లోకి దూసుకువెళ్లారు. భారీ ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు విద్యార్థులు.. WE WANT జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. స్టూడెంట్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్..
Read Also: Story Board: సోషల్ మీడియా హద్దులు దాటుతుందా?
కాగా, BED సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ మృతి పట్ల విద్యార్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిన్న రాత్రి వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని పోయి రచ్చ రచ్చ చేశారు.. ఈ రోజు యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. అందులో ఈ రోజు పరీక్షలు, క్లాస్‌లో బహిష్కరించింది ఆందోళనకు దిగారు.. అయితే, విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ అనే 25 ఏళ్ల విద్యార్థి.. యూనివర్సిటీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతూ క్యాంప్‌లోని శాతవాహన హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం వాష్‌రూమ్‌లో జారిపడ్డాడు.. విద్యార్థులు వెంటనే వర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్ చేసి అంబులెన్స్‌ను రప్పించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.. తనకు ఊపిరి అందడం లేదని, ఆక్సిజన్ పెట్టాలని మణికంఠ కోరాడు.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అప్పటి నుంచి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు..