Education Minister: యూజీసీ- నెట్2024, నీట్ పేపర్ లీక్ వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ రద్దు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌ను రద్దు చేయకూడదని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పేపర్ లీక్ అనేది పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందన్నారు. 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జరిగిన పరీక్షలను రద్దు చేయడానికి దారి తీసిన సంఘటనలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూస్తుందన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.. న్యాయస్థానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Read Also: Samyuktha Menon : బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త.. లక్ అంటే ఇదే..
అలాగే, కొంతమంది చేసిన ఈ తప్పుడు పని వల్ల కష్టపడి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కెరీర్‌ను తాకట్టు పెట్టడం అన్యాయం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాము బీహార్ పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం.. వారి దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తా.. వ్యవస్థలోని అవకతవకలను సరిదిద్దుతాము.. మాపై నమ్మకం ఉంచండని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం సహించదు అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Read Also: Samsung Galaxy S24 Ultra: నయా కలర్‌లో ‘గెలాక్సీ S24 అల్ట్రా’.. లుక్ అదిరిపోలా!
ఇక, మే 5వ తేదీన ఎన్టీఏ నిర్వహించిన NEET-UG 2024 పరీక్షలో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. అయితే, ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే వాదనలతో ఈ వివాదం తలెత్తింది. ఇందులో 1,500 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వివిధ కోర్టులలో దాఖలైన కేసులతో సహా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎన్టీఏ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. కాగా, నీట్- యూజీసీ పరీక్షలో 67 మంది స్టూడెంట్స్ కు 720 మార్కులు రావడంతో క్వశ్చన్ పేపర్ లీకైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, అభ్యర్థులకు తప్పుడు ప్రశ్నలతో పాటు సమయం ఆలస్యం కావడం వల్ల కొంత మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఎన్టీఏ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.