మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్‌ఇహెచ్‌యూ) ఆందోళనలతో అట్టుడికింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలు ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. కొందరు దుండగులు విద్యార్థుల ముసుగులో చెలరేగిపోయారు. వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ పీఎస్.శుక్లా నివాసంపై దాడికి తెగబడ్డారు. బంగ్లా, కారును ధ్వంసం చేశారు. అయితే వీసీ ప్రభా శంకర్ శుక్లా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’
సమాచారం అందుకున్న ఎస్పీ అశ్వఘోష్ నేతృత్వంలోని పోలీసు సిబ్బందితో పాటు పలువురు అధికారులు యూనివర్సిటీలో మోహరించారు. పరిస్థితులు మరింత ఉధృతం కాకుండా విద్యార్థులను చెదరగొట్టారు. మరోవైపు యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Amaravati: అమరావతి అభివృద్ధికి ముందడుగు.. ఢిల్లీలో కీలక భేటీ
యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ నవంబర్ 9న విద్యార్థి సంఘాలు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌కు ఆయా వర్గాల నుంచి మద్దతు లభించింది. విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు, ఇతర ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ మార్చ్ వీసీ అధికారిక నివాసం వైపు నుంచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సీటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే వర్సిటీ వీసీని, మరో ఇద్దరు అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Prajwal Revanna: రేవణ్ణకి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అత్యాచారం కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణ