ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861…
చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్‌గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్ ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్ టైం జాబే…
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్‌ను గడగడా తాగేశాడు. చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి…
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే…
ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్‌కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్…
బెంగళూరులోని నందిహిల్స్ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నంది హీల్స్ ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. నంది హిల్స్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇదేవిధంగా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల నిశాంక్ శర్మ అనే యువకుడు నంది హిల్స్‌కు ట్రెక్కంగ్ కోసం వచ్చాడు. అయితే, అనుకోని విధంగా కొండపైనుంచి దొర్లి 300 అడుగుల కిందకు పడిపోయాడు. భూమిపై ఇంకా నూకలు…
విద్యను బోధించే టీచర్లకు, విద్యార్థులకు మధ్య బాండింగ్ చాలా బాగా ఉంటుంది. కొంత మంది విద్యార్థులు టీచర్లతో కలిసిమెలిసి ఉంటారు. టీచర్లు కూడా విద్యార్థులతో స్నేహంగా మెలుగుతారు. అలాంటి టీచర్లకు స్కూల్‌లో గౌరవం అపారంగా ఉంటుంది. అలాంటి టీచర్లు రిటైర్ అయ్యే సమయంలో వారికి ఇచ్చే ఫేయిర్‌వెల్ పార్టీని అద్భుతంగా నిర్వహిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. బెంగాల్‌లోని 24 పరగణాల ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు…
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. నాని సినిమాలో పెన్సిల్ పోయిందని పిల్లాడు కంప్లైంట్ చేస్తాడు. అలాంటి కంప్లైంటే వస్తే పోలీసుల పరిస్థితి ఎలా వుంటుంది. అచ్చం సినిమా తరహాలోనే ఫిర్యాదు అందింది. పండగ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చాడో కుర్రాడు. ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ వెతికి పెట్టమని పోలీసుల్ని ఆశ్రయించాడో ఆరవ తరగతి చదువుతున్న బాలుడు. సైకిల్ వెతకండి అంటూ పోలీస్ స్టేషన్…
తిరుపతి శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ ప్రేమపాఠాలు వల్లించాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో ఒక బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది… ఆ కాలేజ్ లో పనిచేసే ఫిజిక్స్ మాస్టర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. క్లాస్ రూమ్…
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో…