Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టాక్సిక్’ బడ్జెట్ 400 కోట్లని, కాదు కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తుంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన ఐదుగురు హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట! లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ రాసుకున్న ‘టాక్సిక్’ కథకు ఐదుగురు హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ‘టాక్సిక్’ ట్రైలర్ చూస్తుంటే హుమా ఖురేషీ నెగిటివ్ రోల్ లో కనిపించింది. యష్ క్యారెక్టర్ ను ఉమనైజర్ గా చూపించారు. తారా సుతారియాతో పాటు రుక్మిణి వసంత్‌తో యష్ రొమాన్స్ చేయనున్నారు.
ఈ ఐదుగురు హీరోయిన్లలో రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్ నయనతారదే! కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ 18 కోట్లు తీసుకుందట. బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జవాన్’ కోసం 10 కోట్లు డిమాండ్ చేసిన నయన్, సౌత్ లో కొన్నేళ్లుగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. కియారా అద్వానీ రోల్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా, పారితోషకం విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. నయన్ 18 కోట్లు తీసుకుంటే, కియారా రెమ్యునరేషన్ 15 కోట్లని సమాచారం. సాధారణంగా 10 కోట్లు తీసుకునే కియారా, ‘టాక్సిక్’ లో పెర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ తో రెచ్చిపోయింది. తన కెరీర్ ‘టాక్సిక్’ కి ముందు, తర్వాతగా చెప్పుకుంటారని కియారానే ఇందులో క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైమ్ 15 కోట్ల మార్క్ దాటేసింది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
- Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
రుక్మిణి వసంత్ క్రేజ్ పెరిగిపోయింది, దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ రావడంతో సినిమాను బట్టి మూడు నుంచి ఆరు కోట్లు తీసుకుంటుందట. బాలీవుడ్ భామలు తారా సుతారియా, హుమా ఖురేషీకి కూడా ‘టాక్సిక్’ నుంచి బాగానే గిట్టుబాటైంది. ఒకటి రెండు కోట్లు తీసుకునే ఈ ఇద్దరూ, ‘టాక్సిక్’ తో రెండు మూడు కోట్ల హీరోయిన్ల జాబితాలో చేరారు. ఇక స్పెషల్ సాంగ్ తో సంజీదా షేక్ మెరుస్తోంది. ఇలా ‘టాక్సిక్’ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ 50 కోట్లకు చేరింది.
తాజావార్తలు
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!