Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మనిషి జీతం కోసం నెలంతా ఎదురుచూస్తాడు. జీతం వస్తుంది. ఇంటి అద్దె చెల్లించాలి.. EMI కట్టాలి.. పిల్లల ఫీజుకు ఖర్చు చేయాలి.. కిరాణా ఖర్చులు పోతాయి. మిగిలింది కొంచెం. అదే కొంచెం రేపటి కోసం దాచుకుంటాడు. ఒకరోజు ఏదైనా అవసరం వస్తే ఉపయోగపడుతుందనుకుంటాడు. కానీ…ఒకే ఒక మెడికల్ బిల్లుతో లెక్కలన్నీ మారిపోతాయి.
ఇది ఇండియాలో కోట్లాది మంది ఉద్యోగుల జీవితాల్లో దాగి ఉన్న భయం. కార్పొరేట్ ఉద్యోగం ఉంది. ప్రతి నెలా జీతం వస్తోంది. కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. అయినా… 94శాతం మంది ఉద్యోగులు ఒక అనుకోని మెడికల్ బిల్లు తమను ఆర్థికంగా ఒత్తిడిలోకి నెట్టేస్తుందని భయపడుతున్నారట. టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ‘ది కార్పొరేట్ హెల్త్ ప్రొటెక్షన్ పల్స్ 2026’ నివేదిక ఈ విషయాన్ని బయటపెట్టింది.
అనారోగ్యం వస్తే? డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎందుకంటే హాస్పిటల్ బిల్లు ఒక ఇంటి బడ్జెట్‌ను కదిలిస్తుంది. పొదుపును కరిగిస్తుంది. EMIలను భయపెడుతుంది. కొన్నిసార్లు… ఏళ్లుగా కష్టపడి దాచుకున్న డబ్బును ఒక్కసారిగా తీసుకెళ్తుంది. ఇక్కడ మరో భయం మొదలవుతుంది.
Also Read
ఉద్యోగం పోతే? దాదాపు 10 మందిలో ఏడుగురు ఉద్యోగులు… ఉద్యోగం లేకుండా తమ ఖర్చులను నడిపించగలమని చెప్పారు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిలబడగలమని నమ్ముతున్నవాళ్లు కేవలం 12 శాతం మంది ఉన్నారు. అంటే జీతం ఆగిపోతే… జీవితం ఆగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటి సమయంలో హెల్త్ పాడైతే అంతేసంగతి. ఒకవైపు ఇంటి ఖర్చులు… మరోవైపు మందులు… మరోవైపు హాస్పిటల్. ఇంకో వైపు… రేపటి భయం. అందుకే ఉద్యోగం మారుతున్నప్పుడు కూడా ఆరోగ్య బీమా కొనసాగాలని 88శాతం మంది కోరుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాళ్లు కేవలం 40శాతం మందే ఉన్నారు. కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మీద చాలామంది ఆధారపడుతున్నారు. 45శాతం మందికి కంపెనీ బీమా తప్ప వ్యక్తిగత ఆరోగ్య బీమా లేదు. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. మన దగ్గర బీమా ఉంది. కానీ అది ఎంత కవర్ చేస్తుంది? కేవలం 41 శాతం మంది మాత్రమే తమ కంపెనీ ఇచ్చే హెల్త్ కవర్లోని అన్ని ప్రయోజనాలు పూర్తిగా తెలుసని చెప్పారు.
మరి మిగతావాళ్లు? వాళ్లకు బీమా ఉంది. కానీ దాని గురించి పూర్తిగా తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీని చదవడు. అప్పుడు అది అవసరం అనిపించదు. 28-34 ఏళ్ల వయసులో కూడా ఇదే కనిపిస్తోంది. తర్వాత తీసుకుందాం. ఇప్పుడేం అవసరం లేదనిపిస్తుంది. కానీ అనారోగ్యం… మన ప్లాన్ కోసం ఎదురుచూడదు. హాస్పిటల్… మన జీతం పెరిగే వరకు ఆగదు. బిల్లు…మన పొదుపు పెరిగే వరకు ఆగదు. ముంబై నుంచి ఢిల్లీ వరకు… బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు.. చెన్నై నుంచి కోల్‌కతా వరకు…8నగరాల్లో 748 మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులపై ఈ అధ్యయనం జరిగింది.
వాళ్లందరికీ కంపెనీ హెల్త్ కవర్ ఉంది. అయినా… భయం ఉంది. అది ఉద్యోగం పోతుందనే భయమో.. జీతం ఆగిపోతుందనే భయమో కాదండి.. ఒక రోజు ఆరోగ్యం దెబ్బతింటే పరిస్థితి ఏంటనే భయం వాళ్లది. మరి పెద్ద పెద్ద కార్పొరెట్ ఉద్యోగుల భయమే ఇలా ఉంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏంటో మనమే ఆలోచించుకోవాలి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!