ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
కోవిడ్ సృష్టించిన భయోత్పాతాన్ని ఇంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. కోట్లాదిమందిని బలితీసుకున్న ఆ రక్కసి ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.తమవారిని కోల్పోయిన కుటుంబాల్లో ఇంకా ఆబాధలు, ఛాయలు పోలేదు కూడా. అలాంటిది ఆ బాధ నుంచే తేరుకోక ముందే చైనా నుంచి మరో కొత్త వైరస్ ఉత్పన్నమైంది. అయితే ఆవిషయాన్ని డ్రాగన్ దేశం.. బయట పెట్టడం లేదు. కోవిడ్ తరహాలోనే దాన్ని గోప్యంగా ఉంచుతోంది.
విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం…