జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
రాజకీయంగా బీజేపీ విజయాల్ని చూసి ఆరెస్సెస్ సంతోషించే మాట వాస్తవం. వీలైనంత వరకు పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధానం కూడా కొంతవరకూ నిజమే. కానీ బీజేపీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా.. మూలాలు మరిచిపోయి.. సంఘ్ సిద్ధాంతాలతో సంబంధం లేని నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, వారి ప్రాధాన్యత పెరగటం ఆరెస్సెస్ ను అసంతృప్తికి గురిచేసేది. అందుకే ఎప్పటికప్పుడు బీజేపీలో జరిగే వ్యవహారాలపై ఆరెస్సెస్ నిరంతర పరిశీలన ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
స్వతంత్ర భారత్ పురోగమిస్తోందనడంలో సందేహం లేదు. ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా నవభారతం.. వృద్ధిరేటుకు వెలుగురేఖగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉండకూడదని పేర్కొంది. ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ సమాజంలో సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వారి కోసమే ఆస్తులు కూడబెడతారు. సంతానాన్ని కూడా ఆస్తిగానే భావిస్తారు. అలాంటిది సంతానం లేదంటే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. దీంతో సంతాన సాఫల్యం కోసం కృత్రిమ మార్గాలను వెతుకుతారు. గతంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రాచుర్యంలోకి రానప్పుడు దత్తతలు ఎక్కువగా జరిగేవి.
Story Board : భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వీయ నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు ..కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి.…
ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎలా అమలుచేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నా.. అమలు చేయాల్సిందే అనే క్లారిటీ అయితే పూర్తిగా కనిపిస్తోంది.