ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉందనే భావన పెరిగింది. అది నిజం కాదని నిరూపిస్తూ.. పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. కనీవినీ ఎరుగని ఘటనతో.. దేశం ఉలిక్కిపడింది. ఉగ్రదాడికి రూపకల్పన చేసిన పాకిస్తాన్ కు మరిచిపోలేని గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది. కశ్మీర్ మారిందనే ప్రచారం అబద్ధమని నిరూపించటమే ధ్యేయంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. తాపీగా నడుచుకుంటూ వచ్చి పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అంతే తేలికగా పరారయ్యారు. గతంలో ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి…
ఏపీలో కక్షలు, కార్పణ్యాలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన దశలో.. ఏపీ పక్కదోవ పడుతున్నట్టు స్పష్టం కనిపిస్తోంది. గతంలో జగన్ ప్రతీకార రాజకీయాలు చేసి పొరపాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ప్రతీకారం విషయంలో జగన్ బాటే పట్టడంతో.. ఏపీ భవిష్యత్తు ఏంటా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్. కానీ కొన్నాళ్లుగా రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏపీలో అయితే గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడూ రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాల్లేవు.
భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి..
ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
కోవిడ్ సృష్టించిన భయోత్పాతాన్ని ఇంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. కోట్లాదిమందిని బలితీసుకున్న ఆ రక్కసి ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.తమవారిని కోల్పోయిన కుటుంబాల్లో ఇంకా ఆబాధలు, ఛాయలు పోలేదు కూడా. అలాంటిది ఆ బాధ నుంచే తేరుకోక ముందే చైనా నుంచి మరో కొత్త వైరస్ ఉత్పన్నమైంది. అయితే ఆవిషయాన్ని డ్రాగన్ దేశం.. బయట పెట్టడం లేదు. కోవిడ్ తరహాలోనే దాన్ని గోప్యంగా ఉంచుతోంది.
విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.