Story Board: బంగారం, వెండి…పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్‌లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి, వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70వేలకుపైగా పెరిగితే…వెండి ధరలు మూడు నెలల్లోనే డబుల్ అయ్యాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర రూ.3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్‌లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తున్నారు.…
Story Board: మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీకున్న హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధారపోస్తా అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో…రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంభాలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు. నాలుగో స్థంభమైనది మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా…
Story Board: ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నా.. అందరి దృష్టీ బెంగాల్ ఎన్నికల మీదే కేంద్రీకృతమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని బలంగా ఢీకొడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచినా.. మమతను ఓడించి.. బీజేపీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంకాస్త కష్టపడితే దీదీని గద్దె దింపటం పెద్ద కష్టం కాదని కాషాయ పార్టీ తలపోస్తోంది.…
Story Board: తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో రూ.736 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగ్గా…. 2025 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.980 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ చెబుతోంది. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా…
Story Board: పాతికేళ్ల తెలుగు రాజకీయాలు తీవ్ర మార్పులకు లోనయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పోటీ నుంచి తెలంగాణ ఏర్పాటు , ఆపై ఏపీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వరకు పరిణామక్రమం సాగింది. ఉద్యమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం, మరియు రాజకీయ స్థిరత్వ చర్చలు ఈ కాలంలో కీలకంగా మారాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ ఏర్పాటు వరకు ఉద్యమ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల…
Story Board: బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. 2025 లో బంగారం ధరలు దాదాపు 70 శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. అంటే ఎంత ధరలు పెరిగాయో చెప్పాల్సిన పనిలేదు. మరొకవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు, కిలో వెండి ధర మూడు…
Story Board: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24, 2025న జీవో నంబర్ 292 జారీ చేసింది. దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 27 పురపాలక సంస్థలు GHMCలో విలీనమయ్యాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.34 కోట్లు దాటింది. ఇది భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. సింగపూర్ కంటే మూడింతలు, మారిషస్ స్థాయి విస్తీర్ణం కలిగిన నగరంగా…
Story Board: మన కరెన్సీ రూపాయి. అమెరికా కరెన్సీ డాలర్. మన కరెన్సీని డాలర్‌తో ఎందుకు పోల్చాలి..? విలువ తగ్గిందనో.. పెరిగిందనో ఎందుకు చూడాలి..? అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ డాలర్‌తో మనకేం పని అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గరా అవసరమైనన్ని డాలర్ల నిల్వలుండటం తప్పనిసరి. అలా లేకపోతే…
Story Board: తెలంగాణలో ఎన్నో తర్జనభర్జనల తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎప్పటిలాగానే ఏకగ్రీవాల సంస్కృతి కూడా ఊపందుకుంది. ఏకగ్రీవాలు చేసుకున్న గ్రామాలకు నజరానాలు, ప్రోత్సాహకాలు ఇచ్చే పని ప్రభుత్వాలు దశాబ్దాల కిందటే మొదలుపెట్టాయి. తద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని కాపాడటంతో పాటు అనవసర వివాదాల్ని నివారించే ఉద్దేశం కనిపిస్తోంది. అలాగే గ్రామాభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించవచ్చనే ఆలోచన ఉంది. కాకపోతే అన్ని మంచి సంస్కృతులూ భ్రష్టుపట్టినట్టే.. ఏకగ్రీవాల కల్చర్‌కు కూడా చెదలు పట్టడం మొదలైంది. ప్రతి…
Story Board: మావోయిస్టులకు కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల కోసం మొదలైన ఉద్యమం.. చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఈ పోరు ఐదు దశాబ్దాల పాటు రాజీలేని విధంగా సాగింది. గతంలో ఓసారి పోలీసులది పైచేయి అయితే.. మరోసారి మావోయిస్టులది పైచేయి ఉండేది. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లే తప్ప.. పోలీసుల మరణాలు కనిపించడం లేదు. ఇంతింతై వటుడింతై…