రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9…
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు. “రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం…
రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.
MLC Nomination: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. వారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది. ఎమ్మెల్సీగా గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని నరేందర్ రెడ్డి…
రాష్ట్ర బడ్జెట్ – 2022-23 లో జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు గ్రాంట్ పెంచాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు ఈ బడ్జెట్ లో గ్రాంట్ ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రుల…