Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచేల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, జోష్ ఇంగ్లిస్‌తో భాగస్వామ్యం , పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడారు. “ఇన్నింగ్స్ చివర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేయడం ఒక రకమైన ‘టార్చర్’ లాగా అనిపించింది. చివరి ఓవర్లలో మేము అనుకున్నట్లు మరో రెండు, మూడు బౌండరీలు రాబట్టలేకపోయాము. ఒకవేళ ఆ పరుగులు వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లం. కానీ క్రెడిట్ మొత్తం రాజస్తాన్ బౌలర్లకే దక్కుతుంది. వారు మ్యాచ్‌ను చక్కగా నియంత్రించి, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు.”
“గడిచిన ఐదేళ్లలో క్రికెట్ చాలా మారిపోయింది. ఒక ఐదేళ్ల క్రితం 220 పరుగులు చేస్తే.. చేతిలో డిఫెండ్ చేయడానికి మంచి స్కోరు ఉందని చాలా నమ్మకంతో మైదానం వీడేవాళ్లం. కానీ ఈ రోజుల్లో ఈ స్కోరు సరిపోదు. ఈ రాత్రి మేము మ్యాచ్ గెలవాలంటే మా ప్లాన్స్‌ను కచ్చితత్వంతో అమలు చేస్తూ చాలా బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక జోష్ ఇంగ్లిస్‌తో నా భాగస్వామ్యం విషయానికి వస్తే.. మేము ఇద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాము. అతని బ్యాటింగ్ శైలి నాపై ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ రోజు మేము నెలకొల్పిన భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నాను.”
పిచ్ గురించి బౌలర్లకు ఇచ్చిన సలహా..
“ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన అద్భుతమైన వికెట్. ఇక్కడ మంచి బంతులు కూడా ఫోర్లు, సిక్సర్లుగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బౌలర్లకు ‘ఎగ్జిక్యూషన్’ చాలా ముఖ్యం. బౌలింగ్ రన్-అప్ స్టార్ట్ చేసే ముందే ఏ బంతి వేయాలనే దానిపై బౌలర్ పూర్తి స్పష్టతతో ఉండాలి. అప్పుడే ఈ పోరులో నిలబడగలం.”
తన రనౌట్ గురించి మాట్లాడుతూ.. అది కేవలం దురదృష్టం మాత్రమే అని.. ఒక్కోసారి ఆటలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి.. సెంచరీ మిస్ అయిందన్న బాధ లేదు.. దాని గురించి అస్సలు ఆలోచించలేదని అన్నారు.
తాజావార్తలు
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!