రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
- భారత్‌లో Moto g37, Moto g37 Power స్మార్ట్ఫోన్లు లాంచ్
- 6.7 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు
- 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్
- Android 17 అప్డేట్ + 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
- IP64 రేటింగ్, MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్
- Moto g37 Powerలో 7000mAh భారీ బ్యాటరీ, 30W టర్బో పవర్ ఛార్జింగ్
- మే 25 నుంచి Flipkart, Motorola వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto g37 Series Launched: భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ Moto g37 5G సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగామోటోరోలా (Motorola) లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో moto g37, moto g37 Power స్మార్ట్ఫోన్లు భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Android 16 వంటి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో కూడా 6.7 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. వీటితోపాటు 1050 నిట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటూ.. స్క్రీన్ రక్షణ కోసం ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i’ ప్రొటెక్షన్‌ను అందించారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 6nm టెక్నాలజీపై తయారైన ఈ చిప్ మంచి పనితీరు అందిస్తుంది. 4GB, 8GB RAM ఆప్షన్లతో పాటు 16GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ కెమెరాను అందించారు. ‘క్వాడ్ పిక్సెల్’ టెక్నాలజీ సపోర్ట్ ఉండటంతో తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీల కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఇచ్చారు. ఈ రెండు కెమెరాలు కూడా 2K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
Also Read
- 8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
- Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్‌లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
- కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
- Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!

సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతాయి. Android 17 అప్డేట్తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. డ్యూరబిలిటీ పరంగా కూడా ఈ ఫోన్లు IP64 రేటింగ్ కారణంగా దుమ్ము, నీటి చిమ్ముర్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే moto g37లో 5200mAh బ్యాటరీతో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇక moto g37 Powerలో 7000mAh భారీ బ్యాటరీతో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రెండు ఫోన్లలో కూడా 6W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇంకా ఈ మొబైల్ లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు:
moto g37 (4GB + 64GB) – రూ.13,999
moto g37 Power (4GB + 128GB) – రూ.15,999
moto g37 Power (8GB + 128GB) – రూ.18,999
ఈ మోటో g37 సిరీస్ స్మార్ట్ఫోన్లు మే 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, అధికారిక మోటోరోలా వెబ్సైట్ & ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.
Made for the ones who don’t slow down.
Starting at just ₹13,999, the moto g37 and moto g37 power is ready when you are. Sale starts 25th May on Flipkart, https://t.co/azcEfy2uaW and leading retail stores. pic.twitter.com/uNwcPZqMeN
— Motorola India (@motorolaindia) May 19, 2026
తాజావార్తలు
-
Maharashtra: టీమ్‌లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
-
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!