Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tree Trimming Job: కేవలం గంటపాటు పని చేసి దాదాపు రూ.49 వేల వరకు సంపాదిస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఇంకేం కావాలి అనుకుంటారా..? అవును ప్రస్తుతం ట్రేడ్ స్కిల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయుడు విశాల్ తన ఇంటి వద్ద జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది.
విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ఒక ప్రొఫెషనల్ ట్రీ ట్రిమ్మర్ (చెట్లను నరికే వ్యక్తి)ను పిలిచాడు. ఆ పని పూర్తి చేయడానికి సుమారు గంట సమయం మాత్రమే పట్టిందట. కానీ అందుకు అతడు చెల్లించిన మొత్తం CAD 700, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.49,000కు పైగానే ఉంది. ఈ విషయం విన్న చాలా మంది ఆశ్చర్యపోయినా.. విశాల్ మాత్రం ఇది సాధారణ విషయమేనని తెలిపాడు.
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
కెనడాలో ఇలాంటి ట్రేడ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుందని చెప్పాడు. చెట్ల కత్తిరింపు పని అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని.. దీనికి ప్రత్యేక నైపుణ్యం, ఖరీదైన యంత్రాలు, ట్రక్కులు, భద్రతా పరికరాలు అవసరమవుతాయని వివరించాడు. అలాగే ఈ పనిలో ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. చెట్టు కొమ్మలు పడే సమయంలో ఎవరికైనా గాయాలు కావడం లేదా ఇళ్లకు నష్టం కలగడం వంటి ప్రమాదాలు ఉండటంతో ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని తెలిపాడు. అందుకే ఈ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తారని పేర్కొన్నాడు.
ఇంకా ఈ ఫీజులో ఇంధనం, కమర్షియల్ ఇన్సూరెన్స్, మెషిన్ మెయింటెనెన్స్, లైసెన్సింగ్, పన్నులు వంటి వ్యాపార ఖర్చులు కూడా ఉంటాయని తెలిపాడు. వేసవిలో చెట్ల కత్తిరింపు పనులు చేసే ఈ కార్మికులు, చలికాలంలో మంచు తొలగింపు పనులు చేస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతారని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రేడ్ స్కిల్స్‌కు విశేష గౌరవం ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ల్యాండ్‌స్కేపింగ్, స్నో క్లియరింగ్, ట్రీ ట్రిమ్మింగ్ వంటి ఉద్యోగాలు చాలాసార్లు వైట్ కాలర్ ఉద్యోగాల కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెడతాయని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!