కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- రూ.8,999 ధరలో itel A100 Pro లాంచ్
- MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్
- 6.6 అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
- UNISOC T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది ఐటెల్ (itel). ఇంత తక్కువ ధరలోనే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 90Hz డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో చిన్నపాటి పడిపోవడం, దుమ్ము, సాధారణ వాతావరణ ఒత్తిడులను తట్టుకునేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే కొనుగోలు చేసిన తొలి 100 రోజులలో స్క్రీన్ దెబ్బతింటే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అందిస్తోంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్ కామెట్ ఆరంజ్, క్లౌడ్ వైట్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.6 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. అలాగే డైనమిక్ బార్ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫీచర్ ద్వారా బ్యాటరీ స్టేటస్, కాల్స్, నోటిఫికేషన్లు వంటి వివరాలను సులువుగా చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లో ఆక్టా-కోర్ UNISOC T7100 ప్రాసెసర్‌ను అమర్చారు. 3GB RAMతో పాటు అదనంగా 5GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ లభిస్తుంది. మొత్తంగా 8GB RAM అనుభవాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది. అంతేకాదు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు microSD కార్డ్ ద్వారా మెమరీని పెంచుకునే అవకాశం కూడా ఉంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. తక్కువ హార్డ్‌వేర్ ఉన్న ఫోన్లలో కూడా మెరుగైన పనితీరును అందించేలా ఈ వెర్షన్‌ను ఆప్టిమైజ్ చేశారు. DTS సౌండ్ టెక్నాలజీతో మెరుగైన ఆడియో అనుభవం లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 8MP కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మెరుగైన కలర్ ప్రాసెసింగ్ అల్గారిథమ్ కారణంగా ఫోటోలు సహజమైన రంగులతో కనిపిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 5000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 10W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సాధారణ వినియోగంలో పూర్తి రోజు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్లో మరో ప్రత్యేకత IR Blaster. దీని ద్వారా టీవీ, ఎయిర్ కండీషనర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను మొబైల్‌తోనే నియంత్రించవచ్చు. అదనంగా అల్ట్రా లింక్ అనే ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది. ఇది తక్కువ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో కూడా బేసిక్ కమ్యూనికేషన్‌కు సహాయపడుతుందని తెలిపింది. ధర విషయానికి వస్తే, కొత్త రూ.8,999గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
Itel A100 Pro ముఖ్య స్పెసిఫికేషన్లు:
* 6.6 అంగుళాల HD+ డిస్ప్లే
* 90Hz రిఫ్రెష్ రేట్
* UNISOC T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్
* 3GB RAM + 5GB వర్చువల్ RAM
* 64GB స్టోరేజ్
* Android 15 Go Edition
* 8MP రియర్ కెమెరా
* 5MP ఫ్రంట్ కెమెరా
* 5000mAh బ్యాటరీ
* 10W ఛార్జింగ్ సపోర్ట్
* సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* IR బ్లాస్టర్
* MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?