MLC Nomination: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. వారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది. ఎమ్మెల్సీగా గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత నరేందర్ రెడ్డి, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడారు. లొటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి దారిలో పెట్టారని ప్రశంసించడంతో పాటు ఉద్యోగులు ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు.
Also Read: Thandel : మొదటి సారి నీ దర్శనం అవుతుంది సామి : అక్కినేని శోభిత
సోమవారం పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి మరొకసారి నామినేషన్ వేస్తానని నరేందర్ రెడ్డి వెల్లడించారు. సోనియా గాంధీకి గెలుపు గిఫ్ట్ అంటూ నరేందర్ రెడ్డి తన విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు, పట్టభద్రులకు గొంతుకగా నిలవడం, వారి సమస్యల్ని పరిష్కరించడమే నా లక్ష్యం అని ఆయన తెలిపారు.