Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- హైదరాబాద్‌లో దారుణం
- ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- బట్టబయలు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియుడితో జీవితం పంచుకోవాలనుకుంది.. కానీ కూతురు అడ్డురావడంతో.. కన్నపేగును తెంచుకోవాలని డిసైడైంది. ఆ సమయంలోనే ఆ తల్లి కన్నింగ్ ఆలోచన చేసింది. కూతురును కడతేర్చితే.. ప్రియుడితో హాయిగా ఉండవచ్చని భావించింది. సీన్ కట్ చేస్తే.. కూతురును చంపిన కేసులో జైలులో ఊచలు లెక్కబెడుతోంది. ఇలాంటి కసాయి తల్లులు కూడా ఉంటారా అనే అనిపించే ఈ దారుణం ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఈ మహిళ పేరు రేఖ. అల్వాల్ ఓల్డ్ అంబేద్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కూతురు. ఈమెకు తల్లిదండ్రులు 2020లో పెళ్లి చేశారు. ఐతే పెళ్లినాటికే ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. పెళ్లైన కొద్ది రోజులకే పాపకు జన్మనిచ్చింది. గర్భం విషయం దాచిపెట్టి తనతో వివాహం జరిపించారని భర్త ఫైర్ అయ్యాడు. దీంతో ప్రతి రోజూ ఇంట్లో భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. చివరకు వారు వేర్వేరుగా నివసించడం ప్రారంభించారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
ఇక యాదగిరి కుటుంబం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపానికి మారిన తర్వాత.. అక్కడే ఉంటున్న రేఖకు సమీపంలోని కిరాణా షాపులో పనిచేసే సాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. సాయిని వివాహం చేసుకోవాలని రేఖ ఒత్తిడి చేసింది. ఇప్పటికే ఆమెకు వివాహమై కూతురు ఉన్నందున సాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. చివరకు సాయి కూడా పెళ్లి చేసుకోలేనని చెప్పి ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయితే అతడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రేఖ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని భావించి.. ఆ చిన్నారి తన్వికను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
వారం రోజుల పాటు కూతురును చంపేందుకు స్కెచ్చేసిన రేఖ.. చివరకు మే 16న ముహూర్తం ఖరారు చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన్వికను ఇంటి పైకప్పు పైకి తీసుకెళ్లింది. అక్కడ ఉన్న నీటి ట్యాంకులో పడేసి మూత బిగించి… ట్యాంకును నీటితో నింపింది. నీళ్లలో గిలగిలా కొట్టుకుంటున్నచిన్నారిపై కాస్తంత కూడా కనికరం చూపించలేదు. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన్విక కనిపించడం లేదని కుటుంబ సభ్యుల వద్ద నాటకం ఆడింది…
చిన్నారి కోసం కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు చాలా ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో రేఖ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా.. రేఖ డ్రామా అంతా బయటపడింది. తన్వికను టెర్రస్‌పైకి తీసుకెళ్లడం.. తిరిగి ఒంటరిగా దిగివచ్చిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా రేఖ తనే కూతురిని ట్యాంకులో పడేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది.
పోలీసులు రేఖపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం కన్నకూతురునే బలి ఇచ్చిన రేఖను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?