CM Chandrababu Serious: శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు..
- శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం సీరియస్..
- అటవీశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ఆరా..
- అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం..
- తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం.. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: AV Solutions Scam : మాదాపూర్‌లో 850 కోట్ల స్కాం.. ఏవి సొల్యూషన్స్ మోసాల కుంభకోణం.!
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
కాగా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల తీరు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై అటవీ అధికారులు పీఎస్ లో ఫిర్యాదు చేయడం, మీడియాకు ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. దోర్నాల -శ్రీశైలం రహదారిపై రాత్రి 11గంటల సమయం లో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. నల్లమల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వు కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు వరకు వాహనాలు రాకపోకలు నిషేధం. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా నెక్కంటి అటవీ బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు.
Read Also: Vaishnavi Murder Case: గండికోటలో బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
ఈనేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డాయ్యాయి. డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రామ నాయక్, డ్రైవర్ కరీం, గార్డు గురవయ్య, మరో గార్డ్ పైనా అనుచరులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని అందులో ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్ కు తరలించారు. వాకీటాకీలు, సెల్‌ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కొన్ని గంటలపాటు నిర్బంధించారు. అక్కడ అందరిని చితకబాదారు. బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. ఈ వ్యవహారం మార్కాపురం డీఎఫ్ ఓ దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. బాధితులు పీఎస్ లో ఫిర్యాదు కూడా చేసారు. బాధితుల్లో దళితులు ఉండడంతో దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..