శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లను ప్రభుత్వం మార్చింది. కొత్త పేర్లను పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంట ను కృష్ణ గిరి, దోమల పెంట ను బ్రహ్మగిరి గా మార్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మార్చాలని అధికారులను ఆదేశించింది.